blog single post
National

2019-02-11 04:14:40

భారత్ చేరిన షినుక్‌ -47ఎఫ్‌!

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అదనపు బలంగా మారనున్న షినుక్‌ -47ఎఫ్‌(ఐ) హెవీ లిఫ్ట్‌ హెలికాప్టర్లు గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి చేరుకొన్నాయి. వీటిని అమెరికాలో ఫిలడేల్పియాలోని బోయింగ్‌ కర్మాగారంలో తయారు చేసి విడిభాగాలుగా భారత్‌ చేర్చారు. ఇక్కడ వాటిని అమర్చి భారత వాయుసేనకు అందచేయనున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన హెలీకాప్టర్లలో షినుక్‌  కూడా ఒకటి.ఈ హెలికాప్టర్‌ చాలా శక్తివంతమైంది. దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను ఇది తీసుకెళ్లగలదు. ఇంధన సరఫరా, సహాయ కార్యక్రమాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది.