blog single post
National

2019-02-11 01:03:00

న్యాయస్థానాల్లో తృతీయ అధికార భాషగా హిందీ:అబుదాబీ

అబుదాబీ న్యాయస్థానాల్లో  హిందీని తృతీయ అధికార భాషగా ప్రకటించింది. ఇప్పుడు వాడుకలో ఉన్న అరబిక్‌, ఆంగ్లభాషలతో పాటు ఇకనుండి హిందీలో కూడా ఇక్కడ న్యాయసంబంధ ప్రక్రియలు కొనసాగుతాయని అబుదాబీన్యాయశాఖ ఒక ప్రకటన చేసింది. హిందీ సంభాషించే  వారు కోర్టులో వ్యాజ్యాల ప్రక్రియలు, ఇతర అంశాలపై అవగాహనను పెంపొందించుకుని ఆపై స్పందించేలా ఎక్కడా కూడా ఎలాంటి అయోమయానికి గురికాకుండా చూడాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.