blog single post
National

2019-02-11 11:06:39

ఉద్యోగాలు చేయడమే కాదు సృష్టించే స్థాయికి ఎదగాలి:ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నిన్న బెంగళూరులోని సీఎంఆర్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో హాస్టల్‌ బ్లాక్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు  ప్రారంభించారు.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు నేర్చుకున్న విద్య ద్వారా ఉద్యోగాలు చేయడమే కాకుండా  వాటిని సృష్టించి తద్వారా అనేక మందికి ఉపాధి కల్పించి దేశ అభ్యున్నతికి తోడ్పడాలని అభిలషించారు. దానికి అనుగుణంగా విద్యాసంస్థలు కృషి చేయాలన్నారు.అనంతరం ‘ది హిందు’ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదస్సులో వెంకయ్య ప్రసంగిస్తూ ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయం కల్పించొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వారి కారణంగా కారణంగా పారిశ్రామిక, వాణిజ్య రంగానికి చెడ్డ పేరు వస్తోందన్నారు.ఈ సందర్భంగా మీడియా కు కొన్ని సూచనలు చేశారు. పాత్రికేయ గౌరవాన్ని మరింత పెంపొందించేలా  ప్రవర్తనా నియమావళిని మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.