blog single post
National

2019-01-12 03:38:30

అవినీతి ఆరోపణలు లేనిది బీజేపీపై మాత్రమే:ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ సమ్మేళనంలో భాగంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లేకుండా జరుగుతోన్న తొలి జాతీయ సమ్మేళం ఇది.ఆయన ఎక్కడ ఉన్నా మనకు వారి ఆశీస్సులు మాత్రం ఎల్లప్పుడూఉంటాయి అని అన్నారు.దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగిన ప్రభుత్వం బీజేపీ దేనని గర్వంగా చెప్పగలను.ప్రతికుటుంబం, ప్రతి వ్యక్తి భాజపాపై నమ్మకం ఉంచారు.కార్యకర్తల శక్తి, సమష్టి కృష్టితో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం.ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించాం.పదేళ్ల యూపీఏ పాలన అవినీతితోనే కొనసాగింది.కొన్ని దశాబ్దాల నిర్లక్ష్యంతో రైతులునష్టపోయారు.తగినంత ఆదాయం లభించినప్పుడే రైతుల ముఖాలు చిరునవ్వుతో ఉంటాయి.ఈ దేశ రైతులకు నూతన జవసత్వాలు ఇచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తోంది.అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని,సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని తెలిపారు.