blog single post
National

2019-01-12 03:14:37

పోటీపై త్వరలో అధికారిక ప్రకటన: తులసి గబ్బార్ద్

2020 సంవత్సరంలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై పోటీకి అమెరికా కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి హిందూ నేత తులసి గబ్బార్డ్‌ సిద్ధమవుతున్నారు.ఆమెతో పాటు సెనేటర్‌ ఎలిజెబెత్‌ వారెన్‌ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.హవాయి నుంచి నాలుగు సార్లు అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తులసి గబ్బార్డ్‌ తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని చెప్పారు.త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లువెల్లడించారు.ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ  చేస్తున్న తొలి హిందువు కావడం గమనార్హం. చిన్న తనంలోనే హిందూ మతంలోకి మారారు.