blog single post
National

2019-01-12 11:12:45

ఎన్.ఎస్.ఈ చైర్మన్ అశోక్ చావ్లారాజీనామా!

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఇ) ఛైర్మన్‌ అశోక్‌ చావ్లా రాజీనామా చేశారు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ కేసులో ఆయన పాత్ర కూడా ఉందని ఈ మధ్య కాలంలో వచ్చిన నివేదికలతో వైదొలగాల్సి వచ్చినట్లు  తెలుస్తోంది. చావ్లా రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఎన్‌ఎస్‌ఇ నిన్న తెలియచేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సెబీ కూడా విచారణ జరపనుంది. ఎయిర్‌సెల్‌- మాక్సిస్‌ కేసులో చావ్లాతో పాటు మరో నలుగురు అధికారులను విచారించడానికి అనుమతినివ్వాలని సిబిఐ ఢిల్లీలోని స్పెషల్‌ కోర్టును కోరింది. ఆర్ధిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైనా స్టాక్‌ ఎక్సేంజీ నిర్వహణలో ఉండకూడదని సెబీ స్టాక్‌ ఎక్సేజీ అండ్‌ క్లియరింగ్‌ కార్పొరేషన్స్‌ నిబంధనలు పేర్కొంటున్నాయి.