blog single post
National

2019-01-11 03:28:37

2019లో పలు కీలక ప్రయోగాలు: ఇస్రో చైర్మన్ కె.శివన్

ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడిపైకి ‘చంద్రయాన్‌-2’ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్‌ తెలియచేసారు.గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించిందని ఈ సందర్భంగా తెలిపారు.గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాములకు మొదట భారత్‌లో,తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పిస్తాము,బృందంలో మహిళ కూడా ఉంటారని చెప్పారు.ఇస్రో మొదట ‘చంద్రయాన్‌-2’ను జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్యలో చేపడతామని తెలిపింది.అయితే కొన్ని పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల తేదీని మార్చారు.మార్చి 25 నుంచి ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని నేడు శివన్‌ తెలిపారు.