blog single post
National

2019-01-11 02:04:36

2020ల్లో అంతర్జాతీయ నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు :బెల్ నెక్సస్

సాంకేతికంగా ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. అంతర్జాతీయంగా న్యూయర్క్‌, లాస్‌ఏంజెల్స్‌, హోస్టన్‌, అట్లాంటా వంటి నగరాల్లో వాహన రద్దీ అత్యధికంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల  క్రిందట ‘ఎయిర్‌ ట్యాక్సీ’ అనే రవాణా వ్యవస్థ గురించిఊహాగానాలు వచ్చాయి. ట్రాఫిక్‌తో సంబంధం లేకుండా ఈ ట్యాక్సీలు గాలిలో ప్రయాణించడం వల్ల సమయం బాగా ఆదా అవుతుంది. ఎయిర్‌ట్యాక్సీలను హెలికాప్టర్లకు అప్డేట్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు.ఎయిర్‌ట్యాక్సీలను బెల్‌ నెక్సస్‌ అనే సంస్థ తయారు చేస్తోంది.ఈ ఏడాది లాస్‌ ఏంజిల్స్‌లో జనవరి 8 నుంచి 11 వరకూ జరుగుతున్న సీఈఎస్‌ సాంకేతిక ప్రదర్శనలో భాగంగా సంస్థ ఈ వాహన నమూనాను ‘అర్బన్‌ ఎయిర్‌ మొబిలిటీ వెహికిల్‌’ పేరుతో ఆవిష్కరించారు. ఈ ఎయిర్‌ ట్యాక్సీలను 2020ల్లో అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు బెల్‌ నెక్సస్‌ సంస్థ కార్య నిర్వాహక ఉపాధ్యక్షుడు రాబర్ట్‌ హాస్టింగ్స్‌ వెల్లడించారు..