blog single post
National

2018-12-06 04:59:13

ఆధార్‌ డేటా ఉపసంహరించుకునేందుకు చర్యలు తీసుకోనున్న కేంద్రం !

ఆధార్‌ వాడకం పై గత సెప్టెంబరులో దేశ  సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొన్ని మార్పులు సూచించిన సంగతి అందరకి విషయమే కాగా … .అయితే  ప్రైవేటు సంస్థలు ఆధార్‌ డెటాను వినియోగించుకోవడం రాజ్యాంగ సమ్మతం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సందర్భంలో దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆధార్‌ చట్టాన్ని సవరించే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. దీని ప్రకారం తమ ఆధార్‌ సంఖ్య బయోమెట్రిక్‌ వంటి ఇతర వివరాలను గతంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన పౌరులు ఆవివరాలను వారి నుండి తిరిగి  ఉపసంహరించుకొనే వెసులుబాటుపై ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేసింది. అయితే ఈ సవరణలకు సంబంధించి ప్రాథమిక ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. 18 ఏళ్ల వయసు దాటిన వారికి అంతకుముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆధార్‌ వివరాలను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది . అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.