blog single post
National

2018-12-06 04:31:09

ఈ నెల 11న నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం !

పార్లమెంటు శీతాకాల సమావేశాలకురంగం సిద్ధమైంది. అయితే ఈ నెల 11న నుండి ప్రారంభమయ్యే ఈ  సమావేశాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగుతాయి.ఈ సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే ఈ నే 10వ తేదీన  రాజ్యసభ ఛైర్మన్ ,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే రోజున లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహిస్తారు.కాగా రాజ్యసభ, లోక్ సభ సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలంటూ ఈ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల నేతలను లోక్ సభ  స్పీకర్, రాజ్యసభ చైర్మన్ సభ్యులను కోరనున్నారు