blog single post
Literature

2019-02-26 04:06:14

సాహితీవేత్త ద్వాదశి నాగేశ్వర శాస్త్రి ఇకలేరు…!

ప్రముఖ రచయిత,విమర్శకుడు ద్వాదశి నాగేశ్వర శాస్త్రి నిన్న అర్ధరాత్రి మృతి చెందారు. శతాధిక గ్రంథాలను రచించిన ఆయన గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సమస్యతో  హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ద్వా. నా శాస్త్రిగా ఆయన అందరికీ సుపరిచితులే. 46ఏళ్లుగా తెలుగు సాహితీ రంగంలో కృషి చేశారు. 1950  జూన్ 15న కృష్ణాజిల్లా లింగాల గ్రామంలో జన్మించిన ఆయన... బీఎస్సీ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. 1972 నుండి నేటి వరకు అన్ని రకాల పత్రికల్లో ఆయన వేలాది పుస్తకాలకు సమీక్షలు చేశారు.  వందేళ్ల నాటి ఛాయా చిత్రాలు, అరుదైన పుస్తకాలు, అలనాటి విశేష కవితలను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రముఖులుగా ద్వాదశి నాగేశ్వర శాస్త్రి కీర్తి గడించారు. ఆయన రచించిన తెలుగు సాహిత్య చరిత్ర  పది ముద్రణలు పొందింది. ఏకధాటిగా 12 గంటల పాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.