blog single post
Literature

2019-02-19 01:17:40

‘అసాధ్యుడు, అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌’ పుస్తక ఆవిష్కరణ..!

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘అసాధ్యుడు, అనితర సాధ్యుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌’ పుస్తకాన్ని నిన్న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడుతూ లోతైన పరిశోధనతో పుస్తక రచన చేయడం ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ప్రత్యేకత అని కొనియాడారు.ఈసందర్భంగా ఈపుస్తక రచయిత యార్లగడ్డ మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడిన ప్రతి తెలుగు వ్యక్తి ఈ పుస్తకం చదవాలని ఆకాంక్షించారు.