blog single post
Literature

2019-01-19 12:36:48

ఈ నెల 25నుండి 27వరకు హైదరాబాద్ లిటరసి ఫెస్టివల్!

ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్‌ లిటరసీ ఫెస్టివల్‌ ఈనెల 25 నుంచి 27 వరకు జరగనుంది . ఈ ఫెస్టివల్‌ను బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు  తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలియచేసారు.భాషపై కూడా ఈ ఫెస్టివల్‌లో కీలక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నామనీ, గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత, అనువాదకుడు, గుజరాతి సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు సితాంషు యశశ్చంద్ర ఈ సదస్సును నిర్వహిస్తారని చెప్పారు.అలాగే, ఈ సమావేశంలో రచనా విభాగంలో విశేష ఖ్యాతి గడించిన రచయితలకు నివాళులు అర్పించడం జరగుతుందనీ, ఇందులో భాగంగా మృణాళినీ సారా భాయ్ ప్రముఖ ఉర్దూ రచయిత కైఫీ అజ్మీ తదితరులు పాల్గొంటారని చెప్పారు.