blog single post
Literature

2018-12-15 12:48:16

“జ్ఞాన్ పీఠ్‌” అందుకోవటం గౌరవంగా భావిస్తున్నా : అమితవ్ ఘోష్

భారత సాహితీ ప్రపంచంలో  ప్రతిష్టాత్మకమైన జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం  సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత అమితవ్‌ ఘోష్‌కు లభించింది. ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేస్తూ జ్ఞాన్‌పీఠ్‌ బోర్డు శుక్రవారం ప్రకటన చేసింది.అమితవ్ ఘోష్‌ పేరెన్నికగన్న నవలా రచయిత. చరిత్రను సమకాలీన శకానికి అనుగుణంగా తీర్చిదిద్దడంలో  ఆయనకుఆయనే సాటి. ఈ పురస్కారాన్ని తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు అమితవ్‌ ఆయన సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. అమితవ్‌ ఘోష్‌ 1956లో కోల్‌కతాలో జన్మించారు. ప్రస్తుతం ఆయన భార్య దేబొరహ్‌ బకెర్‌తో కలిసి న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. దిల్లీ, ఆక్స్‌ఫర్డ్‌, అలెగ్జాండ్రియాల్లో విద్యను అభ్యసించారు . అయితే ఇప్పటికే  పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డులుపొందారు . షాడోలైన్స్‌, ది గ్లాస్‌ ప్యాలెస్‌, ది హంగ్రీ టైడ్‌, సీ ఆఫ్‌ పపీస్‌, రివర్‌ ఆఫ్‌ స్మోక్‌, ఫ్లడ్‌ ఆఫ్‌ ఫైర్‌ వంటి నవలలు రాశారు.