blog single post
Literature

2018-10-01 06:59:51

పద్మశ్రీ పుల్లెల్ల కొండయ్యకు ఘన సన్మానం

ఈరోజు రాజోలు కళా సమితి ఆద్వర్యంలో  ఎస్ఆర్ఎల్ జి కళా సమితి వ్యవస్థాపకులు భారత్ మహన్, పద్మశ్రీ  పుల్లెల్ల కొండయ్యకు ఘనంగా సన్మానించారు. గత 45 ఎళ్ళుగా కళాకారుల అత్యున్నతి కృషిచేస్తు పలు సేవలు అందిస్తున్నందుకు గాను కళాసమితి సన్మానించింది. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ,.. రంగ స్థల వృద్ద కళాకారులకు ప్రతి నెల 1500 పించను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ఇటువలే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసామని 1500 రూపాయల కళాకారుల పించన్ ను 3000రూపాయలు చేయాలని వినతిపత్రం సమర్పించామన్నారు. 
పించన్ పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది....
ఇప్పటికే రాష్ట్రంలో 7500 మంది కళాకారులకు పించన్లు అందజేస్తున్నారని, రానున్న రోజుల్లో పించన్ పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని దినికి కళాకారులంతా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి బాస్కర్ల రాజేశ్వరి, కాపిశేట్టి సాయిబాబు, దూనబోయిన వీర రాఘవులు, సరిదే లక్ష్మీ, పలువురు పాల్గొన్నారు.