blog single post
Literature

2018-09-27 07:54:00

రేపు విజయవాడలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నాటకోత్సవాలు

జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న జాషువా 123వ జయంత్యుత్సవాల్లో భాగంగా ఈ నెల 28న నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నాటకోత్సవ కన్వీనర్‌ జి.వి.రంగారెడ్డి తెలిపారు. దుర్గాపురంలోని నండూరి ప్రసాదరావు శ్రామిక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి వరుసగా 'భళా డింగరీ', 'కన్నీటి కథ', 'మాయ పొర' నాటికల ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాషువా సాంస్కృతిక వేదిక సభ్యులు డాక్టర్‌ బి.ఉదయభాస్కర్‌, ఎల్‌ఎస్‌ఆర్‌కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.