blog single post
Literature

2018-09-27 10:51:56

అనంతపురంలో ఘనంగా గుర్రం జాషువా 123వ జయంతి వేడుకలు

గుర్రం జాషువా రచనలు ప్రపంచాన్ని మేల్కొలిపే దిశగా ఉన్నాయని, ఆయన విశ్వకవి అని సిని విమర్శకులు, సామాజిక ఉద్యమనేత కత్తి మహేష్‌ పేర్కొన్నారు. నిన్న గుర్రం జాషువా 123వ జయంతి వేడుకలను ఎంఆర్‌పిఎస్‌ , టిడిపి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పరిషత్‌లో జయంతి సభను నిర్వహించారు. కత్తిమహేష్‌ మాట్లాడుతూ,.. గుర్రం జాషువా సమాజానికి దోహదపడే రచనలను చేశారని అన్నారు. తెలుగులో పద్యనాటకాలు, కావ్యాలు సుదీర్ఘంగా రచించారని, ప్రతి రచయిత, పౌరుడు జాషువా అడుగు జారల్లో నడవాలని సూచించారు. జయంతి సందర్భంగా విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా వ్యాస రచన పోటీలను నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. జాషువా మనువడు సందేష్‌, బిసి సంఘం నాయకులు రమేష్‌గౌడ్‌ మాట్లాడారు. అంతకు ముందు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన నీలవర్ధన్‌, పవన్‌, అశ్విని, భరణి, నవ్య అనే విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు.