Rajakiyam

2018-12-06 05:27:38

వచ్చే ఏడాది జనవరి నుండి ఏపీలో బీజేపీ బస్సు యాత్ర...!

ఏపీలో  బస్సు యాత్ర చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.ఈ సమావేశంలో బస్సు యాత్ర నిర్వహణ పైనే ప్రధానంగా చర్చ జరిగింది అని చెప్పారు.ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస నుండి బస్సు యాత్ర ప్రారంభమై కర్నూలు జిల్లాలోముగుస్తుంది అని తెలిపారు.అయితే 15 రోజులలోనే బస్సు యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగనుంది అని అయన చెప్పారు. అయితే 2019 జనవరిలో జరిగే ఈ యాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ విజయాలపై ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేతలు తెలిపారు.ఈ యాత్రలో జాతీయ నేతలు,కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటి... ఇంటికి  కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది అని తెలిపారు. కాగా పార్టీ బలోపేతానికి బస్సు యాత్ర బాగా ఉపయోగపడుతుందని నేతలు చెబుతున్నారు.ఈ నెల 10న గుంటూరులో పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో బస్సు యాత్ర నిర్వహణ వివరాలు ఖరారు చేయనున్నట్లు చెప్పారు .