Rajakiyam

2018-12-06 04:05:19

అందరికి అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే మా లక్ష్యం:పవన్

అనంతపురం జిల్లాలో పర్యటనలో భాగంగా గార్లదిన్నె మండలం మర్తాడులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతూ…ఏపీలో అభివృద్ధి ఫలాలు అందరికీ చేరువ అవాలని పవన్ అన్నారు. అలానే ప్రభుత్వం  ఇచ్చే రేషన్‌ బియ్యం బాగుండడం లేదని... అందువల్ల రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు.అంగవైకల్యం ఉన్నవాళ్ళకి రూ.5 వేల నుండి రూ.10 వేల వరకు పింఛను ఇస్తామని పవన్ చెప్పారు. వృద్ధులకు వారికి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. అయితే జనసేన మేనిఫెస్టో ఉన్న కరపత్రాన్ని అందజేసి...అందులోని అంశాలను వివరించారు.జనతరంగం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని, దీనిని ప్రపంచమంతా వీక్షించవచ్చన్నారు. మేం ఎన్నికల కోసం, ఓట్ల కోసం రాలేదు. మీ బిడ్డల భవిష్యత్‌ కోసం వచ్చాం అని...అందుకోసమే జనసేన పార్టీ  పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు .

అన్ని రాజకీయ పార్టీలు కులాలను వాడుకుంటాయి.అయితే మేం అన్ని కులాలను ఒక చోట చేర్చేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పారు. పవన్ తొలుత గ్రామంలోని 63 ఏళ్ల వ్యవసాయ కూలీ జీలకర్ర ముత్యాలప్ప ఇంటి తలుపు తట్టారు.ఆ కుటుంబ సభ్యులు పవన్ స్వాగతం పలికారు.తన కుమారుడు జర్నలిజం చదివి  నిరుద్యోగిగా ఉన్నాడని, తాను అర్థరూపాయి కూలీ నుండి ఇప్పటికి పనిచేస్తున్నానని.. నాకు వృద్ధాప్య పింఛను రావడం లేదని ముత్యాలప్ప పవన్ కి చెప్పారు.ఇంతటి కష్టాల్లో ఉన్న వారిని ప్రభుత్వాలు బాగా చూసుకోవాలని పవన్‌ చెప్పారు.62 ఏళ్ల వయసులోనూ కష్టపడాల్సి రావడం మారాలి అన్నారు. ఓ వైపు కులాలు ఉండకూడదంటూనే మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌ అంటూ విడగొడతారని...కులాలు లేనప్పుడు అన్నీ కలిసే ఉండాలని అన్నారు..పాలకులు అభివృద్ధి చేయకపోగా.. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తప్పుబట్టారు. తాను ఓట్లు వేయించుకోవడానికి రాలేదని, మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని... పాతికేళ్లు ప్రజల కోసం పని చేయడానికి వచ్చానని చెప్పారు.రైతు రుణమాఫీపై చంద్రబాబు నోరు తప్ప చేయి మాట్లాడడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనడంలో ఉన్న శ్రద్ధ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై పెట్టడం లేదని ఆరోపించారు.

రాజకీయ నాయకులు చివరకి  రాజ్యాంగాన్ని హైజాక్‌ చేస్తున్నారు

రాజకీయనాయకులు పేదల పక్షాన నిలవకుండా సొంత లబ్ధి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.రాజకీయనాయకులు రాజ్యాంగాన్ని కూడా  హైజాక్‌ చేస్తున్నారని పవన్‌ అన్నారు.స్వచ్ఛమైన రాజకీయాలను తెచ్చేందుకు యువతముందుకు రావాలని అన్నారు .పేదల అభివృద్ధి,నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే జనసేన లక్ష్యం అని పవన్ చెప్పారు. ఇజ్రాయెల్‌ తరహాలో అగ్రికల్చర్‌ జోన్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాం అని తెలిపారు.రైతులకు క్యాలెండర్‌ ప్రాతిపదికన సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలి.సమాజంలో అవినీతిపై రాజీలేని పోరాటం చేయడంలో జనసేన ముందుంటుంది అని తెలిపారు. అయితే కరపత్రాల్లోని అంశాలను జన సైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసే దిశగాకృషి చేయాలనీ అన్నారు. జన సైనికులు, యువత ప్రతి ఇంటి తలుపూ తట్టి మేనిఫెస్టో, సిద్ధాంతాలను వివరించాలని సూచించారు.