Rajakiyam

2018-12-06 01:26:48

ప్రధాని మోదీకి దత్తపుత్రులు జగన్ ,పవన్ మంత్రి లోకేష్


ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు దత్తపుత్రులు ఉన్నారని వైసిపి అధినేత జగన్‌ ఒకరు కాగా … మరొకరు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై  ఏపీ ఐటీ,పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ విమర్శించారు. బీజేపీలో బీ అంటే భారతీయ జనతాపార్టీ,జ అంటే జగన్‌ పార్టీ, పా అంటే పవన్‌పార్టీ అని లోకేష్ ఎద్దేవా చేశారు.అయితే  జగన్‌.. ఆవు, అంబులెన్సు డ్రామా వేసినా, కోడికత్తి నాటకం ఆడినా రక్తికట్టలేదన్నారు.పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్రకు వెళ్తే అక్కడ ప్రత్యేకం అంటున్నారని, రాయలసీమకు వెళ్తే అక్కడ ప్రత్యేకం అంటున్నారని అన్నారు. అనంతపురంలో తనపై పవన్‌ చేసిన ఆరోపణలు బాధించాయని అని మంత్రి నారా లోకేష్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, భీమవరం ప్రాంతాల్లో లోకేష్‌ పర్యటించారు.నరసాపురం మండలం బియ్యపుతిప్పి వద్ద ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.మొగల్తూరు మండలంలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.అనంతరం ఇక్కడ  జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జడ్పీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎంపీ తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.