రేపు జరగబోయేతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు జనసేన అధినేత పవన్కళ్యాణ్ తన సందేశమిచ్చారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ..గర్జించిన దాశరథి కృష్ణమాచార్య కవిత్వంతో పవన్ తన వీడియో సందేశాన్ని ప్రారంభించారు. పోరాటవీరుల స్ఫూర్తితో తెలంగాణ యువత రాష్ట్రాన్ని సాధించుకుందని అభిప్రాయ పడ్డారు. ముందస్తు ఎన్నికలు రావడంతో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిందని చెప్పారు. ''తెలంగాణ సాధించామన్నవాళ్లు ఒకవైపు, తెలంగాణ ఇచ్చామన్నవాళ్లు మరోవైపు ఉన్నారు. ఇప్పుడు తాను చెప్పేది ఒకటే. ఎక్కువ పారదర్శకతతో, అవినీతి రహిత పాలన ఎవరు అందించగలరో వారికే ఓటెయ్యండి'' అని పిలుపునిచ్చారు.
- Navyandhra Times