Rajakiyam

2018-12-05 05:17:35

ధర్మ పోరాట దీక్షకు 100 కోట్లు ఖర్చు పెడతారు కానీ చేనేత కార్మికుల ఆదుకోరు : పవన్‌

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో చేనేత కార్మికులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ …. ధర్మ పోరాట దీక్ష అని వందల కోట్లు సీఎం ఖర్చు పెడతారు కానీ చేనేత కార్మికుల చావులు ఆపలేరా? అని పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబు ను ప్రశ్నించారు. అయితే మగ్గం నేయడం రాని వారు కోట్లు సంపాదిస్తుంటే చేనేత కార్మికులు పస్తులతో చనిపోతుండటం బాధాకరం అని అన్నారు .చేనేత కార్మికులు చనిపోయాక భిక్షాటన చేయటం కాదు… చేనేత కార్మికులు చనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.అయితే దీనిపై జీఎస్టీ మీద ఎవరూ మాట్లాడటం లేదన్నారు. ప్రజల వైపు బలంగా నిలబడే గుండె ధైర్యం అధికార, ప్రతిపక్షాలకు లేదన్నారు.చేనేత కళాకారులకు తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు . చేనేత కలను నేర్చుకోవాలనుకుంటున్న యువతకు స్టైఫండ్‌ ఇచ్చి శిక్షణా కేంద్రాలను ధర్మవరం నుండే ప్రారంభిస్తామన్నారు.రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చేనేత కార్మికులకు గుర్తింపునిస్తామనిచెప్పారు. జనసేన ప్రభుత్వం వచ్చాక కామన్‌ హాస్టల్స్‌ పెడతామన్నారు