Rajakiyam

2018-12-05 03:32:03

కోతల నాయుడు…అవినీతి నాయుడు... సీఎం పై విమర్శలు చేసిన వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు పై ట్విట్టర్‌ వేదికగా వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు . గొట్టమార్గంలో ప్రయాణికులను చేరేవేసే హైర్‌లూప్‌ రవాణా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది అన్నారు. అబద్దాల... నాయుడు అనంతపూర్‌-అమరావతి-విజయవాడ-వైజాగ్‌ వరకు 600 కిలోమీటర్ల మేర దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.అయితే అమరావతిలో ఒలంపిక్స్‌ అన్నట్టుగా ఉందని, ఈ హైపర్‌ లూప్‌ సంగతి అని విజయసాయి రెడ్డి అన్నారు.తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుంది 13 సీట్లలో అయినా 119 స్థానాల్లో అంతా మీరే అనట్లు బిల్డప్‌ ఇస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఐటి, ఈడి, సిబిఐ, ఏసిబి, కళ్లుకప్పి 1200 కోట్లు చేరేసి అక్కడా ఈ అవినీతి సొమ్మును ఖర్చు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని, మీ అవినీతిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని అన్నారు.ఏపీలో పాలనను గాలికి వదిలేసి కమెడియన్‌ లాగా రాహుల్‌ భజన చేస్తున్నారన్నారు విమర్శించారు.

మా  ప్రభుత్వానికి ఎప్పుడూ ప్రజలు ముందే అనే  కోతల నాయుడు మొదలు పెట్టిన మీ కోసం పథకం ఆచరణలో ఎంత డొల్లతనం ఉందొ చెప్పడానికి నిన్న మచిలిపట్టణంలో జరిగిన విషాద ఘటన చాలు అన్నారు. కాళ్లు అరిగేలా తిరిగినా న్యాయం దక్కడంలేదు అంటూ ఒక యువకుడు ఎండ్రిన్‌ తాగి జాయింట్ కలెక్టర్ కళ్ల  ముందే కన్నుమూశారు. వెలుగు చూడని ఇటువంటి విషాద ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు ఎవరూ మాత్రం ఎస్సీలుగా జన్మించాలనుకుంటారు అంటూ… హేళన చేసి మాట్లాడారు. అయితే భారతదేశంలోని ప్రజలంతా ఒకే జాతి వారు, సాంఘీక విభజన వల్ల కులాలు పుట్టకొచ్చాయని డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు.ఈ విభజనలను రూపుమాపాల్సిన బాద్యత ఉన్న మీరు ఇలా అనడం దుర్మార్గం కాదా అంటూ ప్రశ్నించారు . తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మీడియా ప్రకటన జోరు చూసి గాంధీ భవన్‌ వర్గాలే నోళ్లు వెళ్లబెడుతున్నాయి.కేవలం ప్రింట్‌, టీవి ప్రకటనలో కోసం రూ.5కోట్లు ఖర్చు చేస్తుంది. నిధులు లేక గాంధీ భవన్‌కు పేయింట్‌ కూడా వేసుకోలేని పార్టీకి రాత్రికి రాత్రి నడమంత్రపు సిరి వచ్చిపడిదంటే అది టక్కరి నాయుడు మహిమే కదా అంటూ ట్వీట్‌ చేశారు.