Rajakiyam

2018-11-08 07:14:23

నోట్ల రద్దును..మేం మాత్రమే వ్యతిరేకించాం!: పవన్ కల్యాణ్

2016లో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దు...దేశంలో సామాన్యుల జీవితాలను చిదిమేసిన ఈనిర్ణయాన్ని కేవలం జనసేన పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నోట్ల రద్దు ఐడియా తనదేనని సీఎం చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారనీ, చివరికి ప్రతిపక్ష వైసీపీ కూడా దీన్ని స్వాగతించిందని వెల్లడించారు. ఓవైపు సామాన్యులు కష్టపడి సంపాదించిన తమ సొమ్మును ఉపసంహరించుకోనేందుకు (విత్ డ్రా) అల్లాడిపోతుంటే మరోవైపు చంద్రబాబు, లోకేశ్ బీజేపీని బహిరంగంగా సమర్ధించారని దుయ్యబట్టారు.ఈ మేరకు పవన్ కల్యాణ్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్ల రద్దు కారణంగా వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.