Rajakiyam

2018-11-08 03:38:36

గెలుపే ప్రాతిపదిక కావాలి : టీటీడీపీ నేతలతో సిఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ టిడిపి నేతల సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర టిడిపి ముఖ్య నేతలు  ఎల్. రమణ ,రావుల చంద్రశేఖర్‌రెడ్డితో ప్రత్యేకంగా  సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల టిక్కెట్ల కోసం తీవ్ర ఒత్తిడి ఉందని అధినేత దృష్టికి టిటిడిపి నేతలు తీసుకెళ్లారు. పొత్తులో సీట్ల సంఖ్య ముఖ్యం కాదని ,గెలుపే ప్రాతిపదిక కావాలని మరో సారి నేతలకు  సీఎం స్పష్టం చేశారు.పోటీ చేసే  టిటిడిపి అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది . అయితే, అభ్యర్థులు ఏఏ స్థానాల్లో పోటీ అనే అంశంపై నేతలు స్పందించలేదు... కాగా  తీవ్రమైన పోటీ ఉండడంతో అసంతృప్తులతో స్వయంగా మాట్లాడుతానని సీఎం చంద్రబాబు నేతలతో చెప్పినట్టుగా సమాచారం.