Rajakiyam

2018-11-08 10:19:59

ఎన్డీయేను గద్దె దించడమే లక్ష్యంగా...నేడు కర్ణాటకు సీఎం చంద్రబాబు!

ప్రధాని నరేంద్ర మోదీపై పోరాటాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎన్డీయేను గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలను ఏకం చేసే పనిని చంద్రబాబు తీసుకున్నారు. ఇప్పటికే న్యూఢిల్లీ వెళ్లి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, కేజ్రీవాల్ తదితరులను కలిసి మద్దతు అడిగిన సీఎం చంద్రబాబు, నేడు కర్ణాటక వెళ్లనున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేసేందుకు జేడీఎస్ మద్దతును ఆయన కోరనున్నట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు బయలుదేరి, మూడు గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. బెంగళూరు పద్మనాభనగర్ లోని దేవెగౌడ నివాసంలో ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ వారం చివరిలో చెన్నై వెళ్లనున్న సీఎం చంద్రబాబు డీఎంకే అధినేత స్టాలిన్ తోనూ చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. 
ఆపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస భేటీలు జరిపి, ఓ కూటమిని ఏర్పాటు చేసి, అన్ని రాష్ట్రాల్లో బలమైన ఉమ్మడి అభ్యర్థులను నిలపడం ద్వారా, ఎన్డీయేను అధికారానికి దూరం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా సమాచారం.