Rajakiyam

2018-11-07 09:04:50

రేపు సీఎంను క‌ల‌వ‌నున్న టీటీడీపీ నేత‌లు

తెలంగాణలో వచ్చేనెలలో జరగనున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌ఫున బ‌రిలో దిగే అభ్య‌ర్థుల‌కు సంబంధించిన వివ‌రాల‌తో ఆ పార్టీ నేతలు రేపు విజ‌య‌వాడ‌లో వారి పార్టీ జాతీయ అధినేత చంద్ర‌బాబు నాయుడును క‌ల‌వ‌నున్నారు. టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు నేత‌లు సీఎం చంద్ర‌బాబును క‌లుస్తుండ‌గా...పార్టీకి కేటాయించిన సీట్లు, అభ్య‌ర్థుల జాబితాను చంద్రబాబు ముందుంచ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే దానిపై చంద్ర‌బాబు ప‌లు సూచ‌న‌లు చేసే అవ‌కాశ‌ముంది.