Rajakiyam

2019-04-15 03:25:40

ఈవీఎంలపై పిర్యాదు చేస్తే మీకు ఎందుకు భయం:నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్  ట్విట్టర్ లో స్పందిస్తూ... వరుస ట్వీట్లతో ఆయా పార్టీలపై మండిపడ్డారు.కాగా ‘అప‌ర‌మేధావులూ.. ఈవీఎం దొంగ‌లంటే భుజాలు త‌డుముకుంటారెందుకు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక‌లు అస్త‌వ్యస్థ నిర్వ‌హ‌ణ‌పై తెలుగుదేశం పార్టీ పోరాటం మీకు చెల‌గాటంగా మారిందని అన్నారు.అయితే ఈవీఎంలపై అనుమానాలంటే వైసిపి అధినేత జ‌గ‌న్‌,ప్రధాని  మోదీ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?’ అని నిలదీశారు.కాగా ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం అంటూ బీజేపీ ఎంపీ పుస్తకం రాస్తే తప్పు లేదు కానీ, అలానే ఈవీఎంలు ట్యాంప‌రింగ్ చేయొచ్చ‌ని కేసీఆర్ మీడియాకి చెప్పొచ్చు కానీ, 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాల‌ని తెలుగుదేశం పార్టీ కోర‌కూడ‌దా?’ అని సూటిగా నిలదీశారు.‘ఐటీ-టెక్నాలజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని  ఈవీఎం వ్య‌వ‌స్థలోని లోపాలను స‌మ‌ర్థించాలా?’ అని ప్రశ్నించారు.అయితే  తెలంగాణలో పనిచేసి ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు మొరాయింపు వెనక ఉన్న కుట్రని నిలదీయకూడదా?తెలుగుదేశం పార్టీ  కంచుకోట‌ల్లాంటి ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు ప‌నిచేయ‌లేద‌ని అడ‌గ‌కూడ‌దా?’అంటూ నారా లోకేష్ నిలదీశారు.

అయితే ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చంటూ 2010లోనే తెలుగుదేశం పార్టీ వెలుగులోకి తెచ్చిందని నారా లోకేష్ వివరించారు.దేశంలో వ్యవస్థల్ని ప్రధాని  మోదీ ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని అన్నారు.ఇంతకుముందు ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని దుయ్యబట్టారు.ప్రధాని నరేంద్రమోదీ నుండి అందిన సాయానికి వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు చెప్పారని నారా లోకేష్ ధ్వజమెత్తారు.