Rajakiyam

2019-04-15 02:24:51

గెలిచేది మేమే:సీఎం చంద్రబాబు

ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… ఏపీలో ప్రతి సర్వే గెలిచేది తెలుగుదేశం పార్టీయే అని చెబుతున్నాయని,టీడీపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.కాగా 110 -140 సీట్లు టీడీపీ గెలుస్తుందని అందరి అభిప్రాయమని ముఖ్యమంత్రి అన్నారు.తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోంది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.టీడీపీ కార్యకర్తలు కష్టపడి పని చేశారని, అందుకే ఈ ఎన్నికలో మా గెలుపు ఏకపక్షం అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేసింది.టీడీపీ గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని,కాగా వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొన్నామని అన్నారు.గతంలో తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించారని,ఆంధ్రప్రదేశ్ లోని 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారని విమర్శించారు.ఈ అక్రమ తొలగింపులను సకాలంలో స్పందించి కుట్రలను భగ్నం చేశామని చెప్పారు.ఐపీ అడ్రస్‌లు ఇవ్వకుండా ఓట్ల దొంగలను కాపాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని, మిషన్‌ రిపేర్ వస్తే.. కొత్త మిషన్ పెట్టాలని పట్టుబట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.కాగా భాస్కర రెడ్డి హత్య, స్పీకర్‌పై దాడి, మహిళా అభ్యర్థులపై దౌర్జాన్యాలు చేశారని విమర్శలుగుప్పించారు.