Rajakiyam

2019-04-15 12:00:23

జగన్ పై మండిపడ్డ దేవినేని ఉమ

ఈరోజు విలేకర్ల సమావేశంలో టీడీపీ నాయకుడు దేవినేని ఉమ  మాట్లాడుతూ... ఈవీఎం లోపాలపై జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడుతున్నారని,ఏవేవో సాకుగా చూపి ఈసీ తప్పించుకుంటుందని ఎద్దేవా చేశారు.కాగా 13 సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఈసీకి లేఖలు రాస్తున్నాడని, వెంటనే ఆదేశాలు వస్తున్నాయని దుయ్యబట్టారు. అలానే 31 క్రిమినల్ కేసులు ఉన్న వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు.ఇన్ని కేసులున్న కానీ విజయసాయిరెడ్డి లేఖలు రాస్తే మాత్రం ఈసీ వెంటనే స్పందిస్తుందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో మహిళలు పెద్ద ఎత్తున ఓటేశారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.కాగా జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరిందని,సీఎం నేమ్‌ప్లేట్‌ తయారు చేసుకునే స్థాయికి పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.జగన్‌ ప్రతిపక్షనేత బాధ్యతను పూర్తిగా విస్మరించారని,అయితే ఈసారి జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని దేవినేని ఉమ వ్యాఖ్యనించారు.