Rajakiyam

2019-04-13 04:16:11

ఇన్ని అరాచకాలు నేను ఎప్పుడూ చూడలేదు:సీఎం చంద్రబాబు

ఈరోజు ఢిల్లీలో భారత ఎన్నికల ప్రధాన కార్యదర్శి అరోరాను ముఖ్యమంత్రి  చంద్రబాబు కలిశారు.సుమారు గంటన్నర పాటు సీఈసీతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది అయింది.కాగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ…. నేరస్తులు చెబితే అధికారులను బదిలీ చేశారని,ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని అరాచకాలు ఎప్పుడూ జరుగులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.కడప మాజీ ఎంపీ,మాజీ మంత్రి  వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని విమర్శించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని బాబు ధ్వజమెత్తారు.కాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు,రాష్ట్ర శాసనసభ స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని ఆరోపించారు.కాగా తాజాగా జరిగిన ఈ  ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని నిలదీశారు.