Rajakiyam

2019-04-13 01:12:51

ఏపీని దెబ్బ కొట్టాలని ఒక పథకం ప్రకారం వ్యవహరించారు:చిన రాజప్ప

ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలుగుదేశం నాయకుడు చిన రాజప్ప అన్నాడు.ఈరోజు చిన రాజప్ప ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...ముందు నుండి కూడా నిజాయితీ అధికారులను బదిలీ చేసి, వారిని మానసికంగా దెబ్బ కొట్టడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ని కూడా దెబ్బ కొట్టాలని ఒక పథకం ప్రకారం వ్యవహరించారని విమర్శించారు.

కాగా ఎన్నికల సంఘం ఈవీఎంల వ్యవహారంలో కూడా సరైన విధంగా స్పందించలేదని మండిపడ్డారు.ఎక్కడైనా ఈవీఎంలు ఒకటో,రెండో ఇబ్బంది వస్తాయి కానీ ఒక్కో నియోజకవర్గానికి 10 లేకపోతే 20 శాసనసభ నియోజకవర్గాలకు తేడా వచ్చాయని చెప్పారు.కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు వచ్చి తిరిగి వెళ్లారని తెలిపాడు.మహిళలంతా ధైర్యంగా వచ్చి ఓటేశారని అందుకే తాము కూడా ధైర్యంగా ఉండాల్సి వచ్చిందని రాజప్ప  అన్నాడు.