Rajakiyam

2019-03-15 12:30:18

మా లక్ష్యం 150+ స్థానాలు సాధించడమే:సీఎం చంద్రబాబు

నిన్న తెలుగుదేశం తొలి జాబితా విడుదల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ కోసం,ఇక్కడి ప్రజల కోసం ఈ 5 సంవత్సరాలు  కష్టపడ్డా... దానికి ఓటు రూపంలో కూలీ అడుగుతున్నానని అన్నారు.మీరు నన్ను మళ్లీ గెలిపిస్తే అద్భుతాలు సృష్టిస్తానని తెలిపారు.మీకు సుపరిపాలన అందించే బాధ్యత నాది అని చెప్పారు.టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.అయితే  ప్రజలకు ఆమోదయోగ్యమైన,నేతలను,కార్యకర్తల మన్ననలు పొందిన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రజల ముందు పెడుతున్నానని,వారిలో కొంతమందికి 85 శాతం ప్రజాదరణ కూడా ఉందని,వీళ్ళని మళ్లీ గెలిపించి ఆశీర్వదించాలని సీఎం కోరారు.కాగా టీడీపీ మిషన్‌ 150 ప్రచార వీడియోను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

పలు చోట్ల క్షేత్రస్థాయి సర్వేలు,ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజా అభిప్రాయ సేకరణ జరిపి ప్రజాసేవ చేసినవారు, వ్యక్తిత్వం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యమిచ్చాని వివరించారు.మిగిలిన అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తానని చెప్పారు .గతంలో ఒక చోట పోటీచేసిన వారిని ఈసారి అవసరాల రీత్యా ప్రస్తుతం వేరే చోటకు మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే మరికొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు.కాగా ఇలాంటి వారందరికీ భవిష్యత్తులో శాసనమండలి, కార్పొరేషన్‌ పదవులు ఇస్తామని అన్నారు.లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా పేదరికమే ప్రామాణికంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేశానని చెప్పారు.అలానే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను, ప్రజలపై భారం వేయకుండానే…పన్నులు, ఛార్జీలు పెంచకుండానే సుపరిపాలన చేశానని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చాలా మంది అఖిల భారత సర్వీసు అధికారులు తెలంగాణలో పనిచేయడానికి ఆప్షన్‌ ఇచ్చారు.అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బీ టీమ్‌ అని ఎగతాళి చేశారని చెప్పారు.అలాంటిది గత 5 ఏళ్లలో సరైన నాయకత్వం అందించి నంబర్‌ 1 బృందంగా తయారు చేశామని సీఎం  వివరించారు.ఈ నెల 16న తిరుపతి, శ్రీకాకుళం, 17న విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, 18న నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, 19న కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.