Rajakiyam

2019-03-15 10:56:39

టీడీపీ తొలి జాబితా విడుదల

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను  నిన్న అర్ధరాత్రి టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విడుదల చేసిన జాబితాలో 126 మంది పేర్లున్నాయి.అయితే కొంతమంది ప్రస్తుత ఎమ్మెల్యేలు నియోజక వర్గాలు మారాయి.కాగా విజయవాడ పశ్చిమ,గుంటూరు తూర్పు నియోజకవర్గాలు మైనారిటీలకు లభించాయి.లోక్‌సభ స్థానాల ఎంపికతో ముడిపడిన నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన వాయిదా పడింది.అత్యధికంగా 126 నియోజకవర్గాలకు తొలి జాబితాలో అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇక 49 నియోజకవర్గాలే మిగిలినట్లైంది.అయితే తొలి జాబితా విడుదలకు ముందు పొలిట్‌ బ్యూరో సమావేశంలోనూ,జిల్లా పార్టీ అధ్యక్షులతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.దీనితో  మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక పార్టీ కార్యకర్తలకు సంతృప్తినిచ్చింది.లోక్‌సభ అభ్యర్థిత్వాల ఎంపిక కొలిక్కి రాకపోవటంతో రెండో విడతలో ఒకేసారి మొత్తం స్థానాల్ని ప్రకటించనున్నారని సమాచారం.