Rajakiyam

2019-03-14 01:07:34

మంగళగిరిలో నేతలతో సమావేశం కానున్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్  ఐటి శాఖ మంత్రి, ముఖ్యమంత్రి  చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఈరోజు సాయంత్రం మంగళగిరి వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ప్రముఖులు, నేతలను మంత్రి లోకేష్ కలవనున్నారు.కాగా మంత్రి లోకేష్ మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.మొదట లోకేష్ విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించినా రాజకీయ సమీకరణల మధ్య  లోకేష్ ను మంగళగిరి నుండి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది.దీనితో మంత్రి లోకేష్ ఈరోజు సాయంత్రం మంగళగిరికి చేరుకుని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నేతలతో సమావేశం కానున్నారని సమాచారం.