Rajakiyam

2019-03-14 01:00:55

ఆ రెండు పార్టీలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆరే:సీఎం చంద్రబాబు

వైసీపీ, టీఆర్‌ఎస్‌ రెండు పార్టీలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆరేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యానించాడు. ఈరోజు కొంతమంది టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబ మాట్లాడుతూ... ఏపీ టీఆర్‌ఎస్‌గా వైసీపీ మారిందని,జగన్‌ను కేసీఆర్‌ డమ్మీ చేశారన్నారని విమర్శించారు.అలానే వైసీపీ పంచిన గోడ గడియారాల్లో టీఆర్‌ఎస్‌ ముద్రలు ఉన్నాయని, గడియారంపై ఫ్యాన్‌ పేపర్‌ చించితే కారు బయటపడిందన్నారు.అలానే వైసీపీ జీపుల్లో గులాబీ రంగు సీట్లు.. వాటిపై కారు గుర్తులు స్పష్టంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

అలానే హైదరాబాద్‌లో వైఎస్ జగన్ షెల్ కంపెనీల భూములకు కేసీఆర్ కాపలా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.కాగా జగన్‌ కేసులు నీరుగార్చడమే బీజేపీ, వైసీపీ లాలూచీకి నిదర్శనమని,కర్నాల్‌ సింగ్‌ లేఖ రెండేళ్లుగా తొక్కిపట్టడమే దీనికి నిదర్శనమన్నారు.అయితే రోజురోజుకూ మోదీ, జగన్‌లో అసహనం పెరుగుతోందని,ఓటమి భయంతోనే జగన్‌ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.