Rajakiyam

2019-02-11 04:02:19

నాలుగు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు:జగన్

ఈరోజు అనంతపురంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావం సభలో వైసీసీ అధినేత జగన్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ … రాక్షసులు,మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. కాగా నాలుగు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారన్నారని చెప్పారు.రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు.మన  పార్టీ అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం మన కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేస్తామని అన్నారు.

సర్వేల పేరులతో ఓటర్‌ జాబితా నుండి పేర్లను తొలగిస్తున్నారుని,వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ఓటర్‌ జాబితా నుండి తొలగిస్తున్నారని జగన్ విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు.దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్‌ కార్యకర్తలకు సూచించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే రూ. 3వేలకు ఎవరూ మోసపోవద్దని,మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4 దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని 3000 వేలు కాదు,5000 వేలు ఇవ్వమనాలని,ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు.