Rajakiyam

2019-02-11 03:52:00

దీక్షల పేరుతో సీఎం రాష్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారు:కన్నా లక్ష్మీనారాయణ

దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పై నిరసన తెలపాలనుకుంటే ముఖ్యమంత్రి ఒక్కరే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా? అని నిలదీశారు.ఈ 5 ఏళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేశారా? అని కన్నా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తే ఆహ్వానించటానికి కనీసం ప్రొటోకాల్‌ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రుల పరువు తీశారని మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ కు 10 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లెక్కలు చెప్పారని,చర్చకు రావాలని సవాల్‌ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు రాలేదని అన్నారు.కాగా యూటర్న్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారని కన్నా వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో దూరం పెట్టారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.