Rajakiyam

2019-02-11 12:46:54

ఎన్టీఆర్‌కు గౌరవం ఇస్తున్నారా?...తిట్లన్నీ వెతికి మరి తిడుతున్నారు:ప్రధాని

నిన్న గుంటూరులో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు.‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ... పద్మభూషణ్‌, దళిత రత్న, కవి కోకిల గుర్రం జాషువా...మహాకవి తిక్కన జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం అని తెలుగులో ప్రసంగించారు.కాగా జాతి నిర్మాణంలో గుంటూరుకు ప్రత్యేకస్థానం ఉందని అన్నారు.ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది.కాగా భారత స్వాతంత్య్ర సేనాని వావిలాల గోపాలకృష్ణయ్య, నాయుడమ్మ లాంటి అందరికీ నమస్సులు తెలియజేసుకుంటున్నా..అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరే చెప్పండి.. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని తీసుకున్నాయన ఎన్టీఆర్‌ కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తామని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్‌కు గౌరవమిస్తున్నారా?సోదర సోదరీమణులారా మీకీ విషయం అర్థమవుతోంది.కానీ ఆయనలాంటి సీనియర్‌ నాయకుడికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదు?తెలుగుదేశం  పార్టీ చరిత్రనే ఆయన మరిచిపోయేంతటి ఒత్తిడి ఏం వచ్చింది?ఇదంతా యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఢిల్లీలోని వారసత్వ వంశపారంపర్య అహంకార కుటుంబం, రాష్ట్రాల్లోని నేతలను ఎప్పుడు అగౌరవపరుస్తూ ఉంటుందని చెప్పారు.ఆ అవమానం చూసిన తరువాతే ఎన్టీఆర్‌ ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్‌ నుండి విముక్తి కల్పించాలనుకున్నారని అన్నారు. అందువల్లే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.కానీ ఈరోజు ఆ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కోవాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ను అవమానించిన కాంగ్రెస్‌ను దుష్ట కాంగ్రెస్‌ అని ఎన్టీఆర్‌ అన్నారు.కానీ ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారని విమర్శించారు.ఇది చూసిన ఎన్టీఆర్‌ ఆత్మ ఎంత ఘోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు అని నరేంద్రమోదీ అన్నారు.

నా కోసం తిట్లన్నీ వెతికి మరి తిడుతున్నారు…!

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ఒక గొప్ప సంస్కృతి, సంస్కారాన్ని చూసిన దేశంలో ప్రతీ పిల్లాడూ ఆంధ్రప్రదేశ్ ను ఉన్నతంగా భావిస్తారు.కానీ కొద్దీ నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుతున్న భాష నిఘంటువులో ఎన్ని తిట్లున్నాయో వాటన్నింటినీ నా కోసం రిజర్వు చేశారు.ప్రతీరోజూ ఒక కొత్త తిట్టుతో నన్ను తిడుతున్నారు,ఇదేనా ఆంధ్ర సంస్కారం? ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకెక్కడిది బాబు గారూ? మీ తండ్రీ కొడుకుల ప్రభుత్వం గురించి... కొద్దీ నెలలుగా  మీరంటున్న మాటల గురించి తెలిసినా నేను మౌనంగా ఉన్నా,నా నోటికి తాళం పెట్టుకున్నా,ఒక్క మాటా అనలేదు.మీ తిట్లు, అభియోగాలను ఆంధ్ర ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. అందువలనే ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో నా పై ప్రేమను చూపుతూ ఇక్కడకి వచ్చారు. అయితే ఈ తండ్రీ కొడుకుల ప్రభుత్వం పోవడం ఖాయం అని చెప్పారు.ఈ అవినీతి పాలన పోవడం ఖాయం.ఆంధ్రలో అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.రానున్న ఎన్నికల తర్వాత అది రానుంది.కాగా జై ఆంధ్రా.. జై ఆంధ్రా.. జై ఆంధ్రా.. భారత్‌ మాతాకి జై.. భారత్‌ మాతాకి జై’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.కాగా సభలో పాల్గొన్న వారిలో పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, హరిబాబు, సీనియర్‌ నేతలు మురళీధరన్‌,మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి,మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, సినీ నటుడు కృష్ణంరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి,బిజెపి శాసన సభ్యులు విష్ణుకుమార్‌రాజు, మాణిక్యాలరావు, మండలి సభ్యులు మాధవ్‌, సోము వీర్రాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.