Rajakiyam

2019-01-12 05:13:47

ఎన్నికల్లో గెలుపుపై సోమిరెడ్డి ధీమా!

తెలుగు దేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన  బుద్ధి చెబుతారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు.గోదావరి- పెన్నా అనుసంధానం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పది శాసన సభ నియోజకవర్గాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాష్ట్రాలకు ఏపీ ఆదర్శమని ఆయన చెప్పారు.అధికారం కోసం జగన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని సోమిరెడ్డివిమర్శించారు.