Rajakiyam

2019-01-12 03:25:37

ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసిన సీఎం చంద్రబాబు

జగన్‌ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం పై సీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తూ…ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ వ్రాసారు.కాగా జగన్ కోడి కత్తి కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి ఎలా వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు.ఇది ఫెడరల్‌ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించడమే సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.కాగా టెర్రరిస్టుల చర్యలు అదుపులోకి పెట్టేందుకు జాతీయ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల హక్కులను హరించివేస్తోందని మోదీ చేసిన వ్యాఖ్యలను లేఖలో బాబు పేర్కొన్నారు.అలానే  2011లో లక్నోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఎన్‌ఐఏకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని చంద్రబాబు మోదీకి వ్రాసిన లేఖలో ప్రస్తావించారు.