Rajakiyam

2019-01-12 11:31:34

సమాజ వికాసమే జనసేన పార్టీ లక్ష్యం:పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ సమాజ వికాసం కోసమే పని చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు.కాగా కులం పేరుతో ప్రజలను విడగొట్టదని పవన్ స్పష్టం చేశారు.ఇలాంటి వాటి పై ప్రజల్లో ఎంతో ఆగ్రహం ఉంది.ముఖ్యంగా మహిళలు మరింత ఆగ్రహంతో ఉన్నారు.ఈ  మార్పు కోసం పనిచేయడం జనసేన పార్టీ లక్ష్యం అని పవన్ తెలిపారు.నిన్న విజయవాడలోని జనసేన కార్యాలయంలో పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కులం,మతం,ప్రాంతీయతను నమ్ముకుని తాను రాజకీయాల్లోకి రాలేదని, మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పారు.కాగా మన వ్యవస్థలో కులం బలంగా పెనవేసుకుపోయింది అని చెప్పారు.అయితే కులాల ఆలోచనలు, వాటి మధ్య ఘర్షణలను అధిగమించకపోతే సామాజిక వినాశనం తప్పదు అని పవన్ అన్నారు. నాయకులంతా కలసి వ్యవస్థను బలహీనపరిచారు అని చెప్పారు.వ్యవస్థను బలోపేతం చేయడమే జనసేన పార్టీ లక్ష్యం అని అన్నారు.కాగా రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని పవన్ అన్నారు.ఈ మార్పునకు జనసేన పార్టీఆలంబనగా మిగలాలి’ అని అన్నారు.మార్క్స్‌ నుండి కాన్షీరాం వరకూ, నక్సలిజం, మండల్‌ రిజర్వేషన్లు, రామజన్మభూమి వివాదం, సోవియట్‌ పతనం, సైన్స్‌-టెక్నాలజీ వంటి అనేక విషయాలను క్షుణ్ణంగా చదివి వాటిని అవగాహన చేసుకున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.కాగా నా ఆలోచనలూ అనుభవాల నుండి పుట్టినవే జనసేన పార్టీలోని 7 మూల సిద్ధాంతాలు అని తెలిపాడు.కాగా రాత్రికిరాత్రి పార్టీ నిర్మాణం చేయడం సాధ్యం కాదు. జనసేన నాయకుడిగా నా నడక ఎలా ఉంటుందో కార్యకర్తలకు తెలియజేసిన తర్వాత నా దారిలో నడవాలని చెప్పడానికి నాలుగేళ్ల సమయం తీసుకున్నాను అని చెప్పారు.

నేతలు మాట్లాడుతున్న మాటలకు, యువత మాట్లాడుతున్న మాటలకూ వ్యత్యాసం కనిపిస్తోంది అని చెప్పారు.వైసిపి అధినేత జగన్‌ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కలలు కంటున్నారు అని అన్నారు.కాగా మళ్లీ తానే రావాలని చంద్రబాబు పోస్టర్లు వేయించుకుంటారు అని పవన్ కార్యకర్తలతో చెప్పారు.వారలా అడుగుతుంటే... మాకు 25 కిలోల బియ్యం అవసరం లేదు... 25 ఏళ్ల భవిత కావాలని యువత అడుగుతోంది అని పవన్ చెప్పుకొచ్చారు.అయితే గతంలో జనసేనకు అసెంబ్లీ స్థానాలు రావని చెప్పినవారే ఇప్పుడు కలసి రావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు అని పవన్ అన్నారు.కాగా కొంతమంది పొత్తుల కోసం టీఆర్‌ఎస్‌ నేతలతో మాట్లాడిస్తున్నారు అని పవన్ కార్యకర్తలతో చెప్పారు.అయితే ఇది మన బలానికి నిదర్శనం పవన కళ్యాణ్ అన్నారు.