Rajakiyam

2019-01-12 10:19:58

నిధులు రాకుండా ప్రధాని మోదీ అడ్డుపడుతున్నారు:సీఎం చంద్రబాబు

6వ విడత జన్మభూమి-మాఊరు ముగింపులో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలులో ఏర్పాటు చేసిన బహిరంగసభలోసీఎం చంద్రబాబు మాట్లాడుతూ … ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత నెత్తిన అప్పులు పెట్టుకుని వచ్చాం.కాగా ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉంది.ఇటీవల జయప్రకాష్‌నారాయణ రూ.85వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రావాలని నివేదిక ఇచ్చారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా నిజనిర్ధరణ కమిటి వేసి రూ.75 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం  నుండి రావాల్సి ఉందని చెప్పారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.కాగా కేంద్ర ఆర్థిక శాఖ నుండి రూ.35వేల కోట్లు ఇవ్వటానికి సిద్ధమని అధికారులు చెబుతున్నారు.అయితే ప్రధాని మోదీ అనుమతి కావాలంటున్నారు అని సీఎం అన్నారు.దీనికి మోదీ అడ్డుపడుతున్నారు అని ముఖ్యమంత్రి చెప్పారు.కేంద్రప్రభుత్వం సహకరించకున్నా... మీకు ఏ ఇబ్బంది రాకూడదని రూ.24వేల కోట్ల మొత్తాన్ని రుణమాఫీ కింద ఇచ్చాం అని సీఎం చంద్రబాబు చెప్పారు. కాగా రామాయపట్నం ఓడరేవును 20 నుండి 22 నెలల్లో పూర్తి చేస్తాం అని అన్నారు.అయితే పోలవరం ప్రాజెక్టును మే నెల నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.అయితే గోదావరి-పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తున్నాం అని చెప్పారు.సోమశిల జలాశయానికి గోదావరి నీరు వస్తుంది...అని ముఖ్యమంత్రి  వివరించారు.ఈ బహిరంగ సభ అనంతరం తర్వాత నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండలం దామవరం దగ్గర నిర్మిస్తున్న విమానాశ్రయ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.కాగా ఏడాదిలో నిర్మాణాన్ని పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.