Rajakiyam

2019-01-11 04:11:23

కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమే…ఇక్కడ బీజేపీకి సినిమా చూపిస్తాం:మంత్రి లోకేష్

ప్రధాని నరేంద్రమోదీ పై ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి లోకేష్ మండిపడ్డారు.ప్రధాని నరేంద్ర మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కాగా సీబీఐ, ఆర్బీఐ లాంటి కేంద్ర సంస్థలను ప్రధాని మోదీ భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రీపగలూ శ్రమిస్తున్నారని,ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోదీని ప్రశ్నించాలి అని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు.ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని ఆరోపించారు.ఏపీకి ప్రత్యేక హోదా పై జగన్‌ ఎప్పుడైనా మోదీని నిలదీశారా అంటూ... మంత్రి లోకేష్‌ ప్రశ్నించారు.అయితే ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో ప్రధాని మోదీ పై ఒక్క విమర్శ కూడా జగన్  చేయలేదు అని అన్నారు.కాగా జగన్‌పై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు.మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, రానున్న రోజుల్లోఆంధ్రప్రదేశ్ లో పూర్తి సినిమా చూపిస్తామని మంత్రి లోకేష్‌ తీవ్రంగా హెచ్చరించారు.