Rajakiyam

2019-01-11 03:57:10

టీడీపీని వీడే ప్రసక్తే లేదు :మంత్రి అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ పార్టీ మారతారంటూ జరిగిన ప్రచారం పై అఖిల ప్రియా స్పందించారు.కాగా ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల ప్రియ మాట్లాడుతూ … ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.కావాలని కొంతమంది పనిగట్టుకుని మరీ నా పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని,వీటిని నమ్మొద్దని ప్రజలను ఆమె కోరారు.అయితే నాకు పార్టీతో ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డ ప్రాంతానికి నీళ్లొచ్చాయని ఆమె చెప్పారు.కాగా పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను వద్దు అన్నాను అని మంత్రి అఖిల ప్రియ వివరణ ఇచ్చారు.అయితే గన్‌మెన్ల వివాదాన్ని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్లానని మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు.