Rajakiyam

2019-01-11 12:50:27

ప్రజల అండదండలు టిడిపికే:ఉప ముఖ్యమంత్రి కే.ఈ.కృష్ణ మూర్తి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ అందుకు సిద్ధంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రజల కోసం చంద్రబాబు 125 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజల దీవెనలు,అండ దండలు  తమ ప్రభుత్వానికి ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.నిన్న ఆయన మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తిరుపతి వెంకన్న వద్దకు వెళ్లినా.. సీఎం కుర్చీ మాత్రం జగన్ కు దక్కదని ఎద్దేవా చేశారు.ప్రధాని మోదీ,తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి జగన్ చంద్రబాబుపై పుస్తకం వేస్తాననటం ఆశ్చర్యంగా ఉందన్నారు.రాష్ట్రానికి ఇంత  అన్యాయం జరుగుతున్నా మోదీని ఎప్పుడైనా జగన్ ప్రశ్నించారా అని జగన్ తీరుని విమర్శించారు.తమ నాయకుడు సీఎం చంద్రబాబు కుటుంబం ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తుంటే నువ్వేం చేస్తున్నావని జగన్‌ను నిలదీశారు.చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని వ్యాఖ్యానించారు.