Rajakiyam

2019-01-10 04:40:25

జగన్‌లా చంపేయండి,చింపేయండని నేను మాట్లాడలేను:పవన్ కళ్యాణ్

వైసిపి అధినేత జగన్ తీరును జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఎద్దేవా చేశారు.కాగా నేను జగన్‌లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ మాట్లాడలేను  అని పవన్ కళ్యాణ్ చెప్పారు.నేను ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగిస్తాను తప్ప అభ్యంతకరమైన భాషను ఉపయోగించనని పవన్ స్పష్టం చేశారు.అయితే కడప జిల్లా నేతలతో పవన్‌ కళ్యాణ్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలోనే పవన్  మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ కు దిశానిర్దేశం చేసేందుకే 3వ పక్షంగా జనసేనను స్థాపించానని పవన్ కళ్యాణ్ వివరించారు.కాగా రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర యువతను రాజకీయ శక్తిగా మార్చే బాధ్యత తీసుకుంటానని పవన్ పేర్కొన్నారు.

అయితే ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టినట్లు పవన్ ఈ సందర్భాంగా గుర్తు చేశారు.నేను 2003లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.అయితే రాజకీయాలు తనకు వ్యాపారం కాదని పేర్కొన్నారు.కాగా అధికారం కోసం చూసేవారికి ప్రజాసంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉండదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు ప్రభావిత రాజకీయాలు పెరిగాయని అన్నారు.