Rajakiyam

2019-01-10 03:04:34

జనసేనను బలోపేతం చేసందుకు క్షేత్ర ఫర్ జనసేన టీమ్ లను ఏర్పాటు:పవన్

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది.జనసేనపార్టీ అయితే గ్రామస్థాయిలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే ఈ బృందాల లక్ష్యమన్న జనసేనా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.అయితే గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.గత కొన్ని రోజులుగా జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్...తాజాగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు దృష్టి సారించారు.దీనిలో భాగంగా క్షేత్ర ఫర్ జనసేన టీమ్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.గ్రామస్థాయిలో ప్రజలను కలిసి, పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడమే ఈ బృందాల లక్ష్యమని చెప్పారు. గ్రామస్తులతో ఆత్మీయ సమావేశాలను కూడా క్షేత్ర ఫర్ జనసేన సభ్యులు నిర్వహిస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు.