Rajakiyam

2019-01-10 02:46:11

ఇక ఎన్నికల్లో పోటీకి స్వస్తి :ఎంపీ జేసీ

తాడిపత్రిలోని ఐశ్వర్య విల్లాస్‌ వద్ద స్పర్శ సేవాసంస్థ ద్వారా జేసీ అశ్మిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న చీరల పంపిణీ జరిగింది.కాగా ఈ కార్యక్రమానికి హాజరైన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ …రానున్న ఎన్నికల్లో తనతో పాటు తన సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయరన్నారు అని తెలిపారు.అయితే మా తరపున అనంతపురం ఎంపీగా జేసీ పవన్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అశ్మిత్‌రెడ్డి పోటీ చేస్తారని,వారిని ఆశీర్వదించాలని కోరారు.అయితే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరమైనా ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.కాగా మా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల్లో వాటిని అడ్డం పెట్టుకొని నయాపైసా ప్రజల నుండి వసూలు చేయలేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.అందువలనే ఎంత పెద్ద వారినైనా తప్పులుంటే ధైర్యంతో ఎదిరించి చెప్పగల ఏకైక వ్యక్తిని తానేనని అన్నారు.కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సుల వలన చాగల్లు ప్రాజెక్టుకు 4 టీఎంసీల నీరు వచ్చాయని చెప్పారు.అయితే తాడిపత్రి ప్రాంతంలోని 6 మండలాల్లో 18 వేల ఎకరాల్లో డ్రిప్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.వాటిలోతాడిపత్రి,పెద్దవడుగూరు,పెద్దపప్పూరు,పుట్లూరు,యల్లనూరు,యాడికిమండలాల్లో రైతుల కోసం ఉచితంగా డ్రిప్‌ను ఏర్పాటు చేసి వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు.కాగా త్వరలోనే తాడిపత్రికి ముఖ్యమంత్రిని చంద్రబాబుని పిలిపించి డ్రిప్‌లను ఆయన చేతులమీదుగా ప్రారంభిస్తాం అని చెప్పారు.అయితే ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి ప్రాంతంలో వైసీపీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌ ఫ్యాక్షనిస్టు అయిన పెద్దారెడ్డిని ఎన్నికల్లో నిలబెట్టేందుకు చూస్తున్నాడన్నారు.అయితే పెద్దారెడ్డి రాకతో రౌడీయిజం,గుండాయిజం పెరిగి అశాంతి వాతావరణం నెలకొంటోందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.