Rajakiyam

2019-01-10 12:39:35

ముఖ్యమంత్రిని రైతులు నిన్ను నమ్మం బాబు అంటున్నారు:వైఎస్ జగన్

వైసీపీ అధ్యక్షడు జగన్ చేబట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురంలో నిన్నముగిసింది.అయితే ఈ పాదయాత్రకు స్మారక గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఈ సందర్బంగా వైఎస్ జగన్ నిన్న ఇచ్చ్చాపురంలో ఆవిష్కరించారు.కాగా ఇచ్చాపురంలో పాతబస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ….నిన్ను నమ్మం బాబూ..అని రాష్ట్ర రైతులు అంటున్నారని ఆయన విమర్శించారు.అయితే రైతులకు రెయిన్ గన్స్ ఇచ్చినట్టు డ్రామాలాడారని, రెయిన్స్ గన్స్ తో కరవును పారద్రోలానని చెప్పుకుంటున్న…  ముఖ్యమంత్రి చంద్రబాబును రైతన్నలు నమ్మడం లేదని అన్నారు.కాగా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మమంటే నమ్మమని రైతులు చెబుతున్నారని జగన్ అన్నారు.

 రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారు అని జగన్ ఆరోపించారు.అయితే నాబార్డు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతులు అప్పుల్లో 2వ స్థానంలో ఉన్నారని జగన్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు అన్నారు.కాగా ఎక్కడా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తెరవలేదని,దళారీలను ప్రోత్సహిస్తున్నారని జగన్ విమర్శించారు.అయితే ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1750 కానీ, వెయ్యి రూపాయలు కూడా రైతుకు రాని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయని జగన్ దుయ్యబట్టారు.శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం,పలాసలో జీడిపప్పు ప్రసిద్ధి అని, రైతుల దగ్గర జీడిపప్పు కేజీ రూ.650కు కొనుగోలు చేసి,ఇదే జీడిపప్పును హెరిటేజ్ లో కిలో రూ.1180కి విక్రయిస్తున్నారని జగన్ ఆరోపించారు.